ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NEET 2025: నీట్‌-2025 ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం

ABN, Publish Date - Jun 15 , 2025 | 04:13 AM

నీట్‌-2025 ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు.

వరంగల్‌ ఎడ్యుకేషన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): నీట్‌-2025 ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. నీట్‌లో జాతీయస్థాయిలో ఎస్‌ఆర్‌ విద్యార్థులు ర్యాంకులు సాధించి మరోసారి విజయపథాన్ని ఎగురవేసినట్లు ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ఎ.వరదారెడ్డి తెలిపారు. వివిధ క్యాటగిరిల్లో జాతీయ స్థాయిలో పి.సాయి దివ్యాన్‌ 14వ ర్యాంకు, బి.ప్రియాంక 100వ ర్యాంకు, ఎం.వినయ్‌ 226వ ర్యాంకు, బి.గణేష్‌ 671వ ర్యాంకు సాధించి విజయభేరి మోగించినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థలకు చెందిన 210 మందికిపైగా విద్యార్థులు మెడిసిన్‌లో సీట్లు సాధించే ర్యాంకులు సంపాదించారన్నారు. నీట్‌లో అత్యధిక ర్యాంకులు సాధించి ఎస్‌ఆర్‌ కళాశాల పేరును నిలబెట్టిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ విద్యా సంస్థల డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతో్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 04:13 AM