Tummala: పీఏసీఎస్‌ల బలోపేతానికి చర్యలు: తుమ్మల
ABN, Publish Date - May 27 , 2025 | 04:05 AM
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి సోమవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. సహకార రంగంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా కోదండరెడ్డి కోరారు.
మరోవైపు ఈనెల 29 నుంచి జూన్ 12 వరకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొని విజయవంతం చేయాలని తుమ్మల ఆదేశించారు. మట్టి నమూనా పరీక్షలు త్వరితగతిన పూర్తిచేయడానికి సాయిల్ టెస్టింగ్ లాబ్స్‌ను ఎఫ్‌పీవోలు, రైతువేదికల్లో పెట్టడం ద్వారా అవసరమున్న రైతుకు మట్టినమూనా పరీక్ష చేసుకొనే వెసులుబాటు కలుగుతుందన్నారు. యూనివర్సిటీ నుంచి ప్రతీ రెవెన్యూ గ్రామంలో ఎంపిక చేసిన ముగ్గురు రైతులకు మూల విత్తనాన్ని ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Updated Date - May 27 , 2025 | 04:05 AM