ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Southwest Monsoon: ముందే రుతురాగం

ABN, Publish Date - May 25 , 2025 | 05:33 AM

ఈ ఏడాది 16 ఏళ్ల తర్వాత సాధారణ తేదీ కంటే 8 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. కేరళను తాకి, త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగా దేశంలోకి..

ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు వరకూ విస్తరణ

రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణకు

రాబోయే 5 రోజులూ వర్షాలే: వాతావరణ కేంద్రం

హైదరాబాద్‌/విశాఖపట్నం/అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): కోట్లాది మంది రైతన్నలకు చల్లని కబురు. ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం. ఈ ఏడాది 8 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. 16 ఏళ్ల తర్వాత సాధారణ తేదీ (జూన్‌ 1) కంటే వారం ముందుగానే వచ్చాయి. నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు వచ్చే అవకాశాలున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో కొద్ది రోజుల్లోనే దేశమంతా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళకు వస్తాయని భారత వాతావరణ శాఖ ఇటీవల ప్రకటించింది. ఐఎండీ అంచనాకు భిన్నంగా మూడు రోజుల ముందే కేరళను తాకాయి. గతంలో 2009లో మే 23వ తేదీనే దేశంలోకి నైరుతి ప్రవేశించగా.. ఆ తర్వాత ఈ సారి మే 24న కేరళను తాకాయి.

కొంకణ్‌కు ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం శనివారానికి వాయుగుండంగా బలపడడం, అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ గాలులు బలంగా వీస్తుండడంతో నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశ భూభాగంలోకి వచ్చాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ కొంకణ్‌కు ఆనుకుని తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం బలపడి వాయుగుండంగా మారింది. తూర్పుదిశగా పయనించి సాయంత్రానికి మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో తీరం దాటింది. వచ్చే 24 గంటల్లో మధ్య మహారాష్ట్ర మీదుగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. మరింత బలహీనపడి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఈ నెల 27వ తేదీలోగా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఆ తరువాత ఉత్తర వాయవ్యంగా పయనించి బలపడుతుందని, ఈ నేపథ్యంలో అరేబియా సముద్రం నుంచి రుతుపవన కరెంట్‌ బంగాళాఖాతం వైపు వీస్తోందని విశ్లేషించాయి. దీంతో రానున్న రెండు, మూడు రోజుల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు పడే అవకాశ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


ఈ ఏడాది ఎక్కువ వర్షపాతం

సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్‌లో 87సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అయితే సీజన్‌ దీర్ఘకాల సగటులో 105 శాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈశాన్య భారత్‌లో అనేక ప్రాంతాలు, దక్షిణాదిలో తమిళనాడు, ఉత్తర భారత్‌లో కశ్మీర్‌, లద్దాఖ్‌ మినహా దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ముందస్తు వేసవితోనే ముందుగా

దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి తొలివారం నుంచే ఎండలు పెరగడంతో వాతావరణం వేడెక్కిందని, దీంతో ఏప్రిల్‌ నుంచే వానలు ప్రారంభమయ్యాయని, ఈ నేపథ్యంలో ఎనిమిది రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ రిటైర్డ్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ కేజీ రమేశ్‌ విశ్లేషించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటు కంటే 1.6 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. దీంతో ఫిబ్రవరి నుంచే దేశంలో వేసవి తీవ్రత క్రమేపీ పెరిగిందన్నారు. మార్చి నెల నుంచి మధ్య భారత్‌లోని నాగ్‌పూర్‌, తూర్పుభారత్‌లోని అనేక ప్రాంతాల్లో రుతుపవన ముందస్తు వర్షాలు కురిశాయన్నారు. అందుకే మే నెలలో ఎండ తీవ్రత తగ్గిందని, వడగాడ్పుల ప్రభావం కూడా పెద్దగా లేదన్నారు.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 05:33 AM