Kaleshwaram Project: విజిలెన్స్ చర్యలు అభ్యంతరకరం
ABN, Publish Date - Jun 14 , 2025 | 03:42 AM
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): నీటి పారుదల ప్రాజెక్టుల పనుల అంచనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే సవరణ అంచనాలకు ఆమోదం తెలిపారని, ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైమ్(ఈవోటీ) ఇచ్చారని, ఒక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగా..
స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ మార్గదర్శకాలను కఠినతరం చేయాల్సిందే.. ఎస్‌ఎల్‌ఎస్‌సీలో నిర్ణయం
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): నీటి పారుదల ప్రాజెక్టుల పనుల అంచనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే సవరణ అంచనాలకు ఆమోదం తెలిపారని, ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైమ్(ఈవోటీ) ఇచ్చారని, ఒక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగా మధ్యలోనే అదనంగా ప్రతిపాదించిన పనులకు ఆమోదం తెలిపారనే కారణాలతో స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎ్‌సఎ్‌సఎల్‌సీ) సభ్యులను బాధ్యులుగా చేసి విచారణకు పిలవడం, క్రిమినల్ కేసులు పెట్టాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేయడాన్ని ఎస్‌ఎల్‌ఎ్‌ససీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం జలసౌధలో ఈఎన్‌సీ(జనరల్) ఛైర్మన్‌గా ఎస్‌ఎల్‌ఎ్‌ససీ సమావేశం జరిగింది. ఈ భేటీలో విజిలెన్స్ సిఫారసులను ఎస్‌ఎల్‌ఎ్‌ససీ సభ్యులు తప్పుపట్టారు. ఇక ముందు విజిలెన్స్ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎస్‌ఎల్‌ఎ్‌ససీ మార్గదర్శకాలను మరింత కఠినతరం చేయాలని అభిప్రాయపడ్డారు.
దీని కోసం ప్రభుత్వం సవరణ మార్గదర్శకాలను జారీ చేయాలని చర్చించారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వ్యవహారంలో ఎస్‌ఎల్‌ఎ్‌ససీ తీరును విజిలెన్స్ తప్పుబట్టింది. అంతేకాకుండా మార్గదర్శకాలు సరిగా లేవని పేర్కొంది. ఎస్‌ఎల్‌ఎ్‌ససీలో సభ్యులుగా ఉన్నవారిపై నేర విచారణకు సిఫారసు చేసింది. దీనికితోడు తాజాగా కొండపోచమ్మసాగర్‌తో పాటు కాళేశ్వరం అదనపు టీఎంసీపై కూడా విచారణకు హాజరు కావాలని ఎస్‌ఎల్‌ఎ్‌ససీ సభ్యులకు విజిలెన్స్ తాఖీదులు పంపడంతో నీటి పారుదల శాఖ అధికారులు భగ్గుమంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇద్దరు ఈఎన్‌సీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) చీఫ్ ఇంజనీర్, డైరెక్టర్ వర్క్ అండ్ అకౌంట్స్‌తో పాటు సంబంధిత ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లను తప్పుబడుతూ ఇటీవలే విజిలెన్స్ నివేదిక ఇచ్చిన విషయం విదితమే.
Updated Date - Jun 14 , 2025 | 03:42 AM