Phone Tapping Case: పట్లోళ్ల మహిపాల్‌రెడ్డికి సిట్ పిలుపు
ABN, Publish Date - Jun 16 , 2025 | 03:58 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్‌రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం (సిట్) నుంచి పిలుపువచ్చింది.
వికారాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఫోన్ ట్యాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్‌రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం (సిట్) నుంచి పిలుపువచ్చింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల గురించి తెలుసుకునేందుకు మహిపాల్ రెడ్డి రావాలని విచారణ అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ఆవరణలోని సిట్ కార్యాలయంలో అధికారుల ఎదుట ఆయన హాజరు కానున్నట్లు సమాచారం.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న మహిపాల్‌రెడ్డితో ఎవరెవరు మాట్లాడుతున్నారనే సమాచారాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెప్పించుకున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో గుర్తించినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిపాల్‌రెడ్డి ఫోన్‌పై నిఘా ఉంచిన పోలీసులు ఆయన రేవంత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, బుయ్యని మనోహర్‌రెడ్డి, బండి రమేష్, జగదీశ్వర్, తిరుపతిరెడ్డిలతో మాట్లాడిన కాల్స్ వివరాలను అప్పటి ప్రభుత్వ నేతలకు ఇచ్చినట్టుగా విచారణలో వెలుగుచూసినట్టు తెలుస్తోంది.
Updated Date - Jun 16 , 2025 | 03:58 AM