SIT Notice; ట్యాపింగ్ కేసులో ఆరా మస్తాన్‌కు నోటీసులు
ABN, Publish Date - Jul 01 , 2025 | 04:20 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్‌ను సిట్ నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్‌ను సిట్ నోటీసులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరా మస్తాన్ ఉపయోగిస్తున్న రెండు సెల్ పోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ విషయంలో ఆయనను విచారించేందుకు ఇది వరకు నోటీసులు జారీ చేసినా, బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేదు.
ప్రస్తుతం కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చినందుకు తప్పనిసరిగా విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని సూచించింది
Updated Date - Jul 01 , 2025 | 04:20 AM