ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SIT Raids: హైదరాబాద్‌లో ఏపీ సిట్‌ సోదాలు

ABN, Publish Date - Jul 27 , 2025 | 04:20 AM

ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో మరిన్ని ఆధారాల సేకరణ కోసం ‘సిట్‌’ హైదరాబాద్‌లో విస్తృత సోదాలు నిర్వహించింది.

  • భారతీ సిమెంట్స్‌ ఆఫీసులోకి బృందం

  • బాలాజీ గోవిందప్ప చాంబర్‌ పరిశీలన

  • అక్కడి మీటింగ్‌ హాల్‌లోనే డిస్టిలరీల ప్రతినిధులతో సమావేశాలు

  • సాంకేతిక ఆధారాలతో గుర్తించిన సిట్‌

  • రాజ్‌ కసిరెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఆఫీసు..

  • చాణక్య ‘టీ గ్రిల్‌’ ఆవరణలో తనిఖీలు

అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో మరిన్ని ఆధారాల సేకరణ కోసం ‘సిట్‌’ హైదరాబాద్‌లో విస్తృత సోదాలు నిర్వహించింది. సహ నిందితులు, డిస్టిలరీల యజమానులతో భేటీలు జరిపిన ప్రాంతాలను గూగుల్‌ టేకౌట్‌ ద్వారా గుర్తించిన ‘సిట్‌’... శనివారం ఆ ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. ఈ క్రమంలో జగన్‌ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌ కార్యాలయంలోనూ అడుగు పెట్టింది. మద్యం స్కామ్‌లో ఏ1గా ఉన్న రాజ్‌ కసిరెడ్డికి చెందిన రిసోర్స్‌ వన్‌ ఐటీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయంతోపాటు ఆయన అనుచరుడు చాణక్య(ఏ-8)కు చెందిన టీ గ్రిల్‌ రెస్టారెంట్‌ (నానక్‌ రామ్‌ గూడ)లోనూ తనిఖీలు నిర్వహించింది.

అక్కడే బాలాజీ భేటీలు...

భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప(ఏ-33) పలువురు డిస్టిలరీల యజమానులతో సమావేశమైన ప్రదేశాన్ని ‘సిట్‌’ ఇదివరకే సాంకేతికత ద్వారా గుర్తించింది. హైదరాబాద్‌ బంజారా హిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఉన్న భారతీ సిమెంట్స్‌ కార్యాలయంలోని ఈ భేటీలు జరిగినట్లు తేలింది. బాలాజీ గోవిందప్ప చాంబర్‌ను పరిశీలించేందుకు వెళ్లిన సిట్‌ సిబ్బందిని... సంస్థ న్యాయవాదులు అడ్డుకున్నారు. బాలాజీ గోవిందప్ప చాంబర్‌లో మాత్రమే తాము తనిఖీ చేస్తామని సిట్‌ అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ న్యాయవాదులు వినలేదు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా ఈ హైడ్రామా కొనసాగింది. సిట్‌ అధికారులు బాలాజీ గోవిందప్ప చాంబర్‌ను పరిశీలించి, ఆయన సహాయకులను విచారించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. ఆయన మీటింగ్‌ హాల్‌ను కూడా పరిశీలించారు. అప్పటికే సేకరించిన సాంకేతిక ఆధారాలతో దీనిని నిర్ధారించుకున్నారు. పక్కనే బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 11లోని బాలాజీ గోవిందప్ప ఇంటికి చేరుకున్నారు. అక్కడ కూడా ఆయన డిస్టిలరీల ప్రతినిధులతో సమావేశమైనట్లు ఇదివరకే గుర్తించారు. అక్కడా సహ నిందితులతో జరిపిన సమావేశాలు, ఇతర అంశాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక... రాజ్‌ కసిరెడ్డి కార్యాలయంలో లభించిన కొన్ని ఫైళ్లు, బూనేటి చాణక్య రెస్టారెంట్‌లో పలుమార్లు సమావేశమైన వ్యక్తుల వివరాలు కూడా సేకరించినట్లు తెలిసింది.

Updated Date - Jul 27 , 2025 | 04:20 AM