ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gambling Apps Scam: బెట్టింగ్ యాప్స్ దందా వెనుక ఇంకా ఎవరున్నారంటే..!

ABN, Publish Date - Mar 19 , 2025 | 09:27 AM

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కొందరు సెలబ్రెటీలపై పోలీసులు చర్యలు ప్రారంభించినా.. గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోషన్లు ఆగడంలేదు. కొందరు వ్యక్తులు టెలిగ్రామ్, వాట్సప్ ఛానల్స్‌లో ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు.

Betting Apps Scam

ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్లపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ఇంకా యాప్స్ ప్రమోషన్‌ను ఆపడం లేదు. దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నవాళ్లు వేల మంది ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రేటీలే కాకుండా మరికొందరు బెట్టింగ్ టిప్స్ మాటున యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. టెలిగ్రామ్‌లో బెట్టింగ్ టిప్స్ పేరుతో ఛానళ్లు ఓపెన్ చేసి.. అందులో మ్యాచ్ ప్రిడక్షన్స్ చెబుతూ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు.


ప్రిడక్షన్స్ ఫెయిల్ అయితే మార్కెట్ మొత్తం ఫెయిల్ అయిందని, నెక్ట్స్ మ్యాచ్‌లో ప్రతాపం చూపిద్దాం.. లాస్ మొత్తం కవర్ చేద్దామంటూ మెసేజ్‌లు పెడుతూ మరింత ఎక్కువ డబ్బును సిద్ధం చేసుకోమని పరోక్షంగా సూచిస్తుంటారు. లాస్ కవర్ కోసమని చాలామంది తరువాత మ్యాచ్‌లకు అప్పు చేసి బెట్టింగ్‌లో పెడుతుంటారు. ఇలా లక్షల రూపాయిలు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా టెలిగ్రామ్‌లో క్రికెట్ అనలిస్టు పేరుతో ఒకరు, సౌత్ ఇండియా కింగ్ పేరుతో మరొకరు విపరీతంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ప్రిడక్షన్స్ ఇవ్వడం ద్వారా మీరు లాభాలు సంపాదించండంటూ తమ ఛానల్‌ను, బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇలా టెలిగ్రామ్, వాట్సప్‌లో గ్రూపులు ఓపెన్ చేస్తూ బెట్టింగ యాప్స్ ప్రమోషన్‌ను చాలామంది ఓ వృత్తిగా ఎంచుకుంటున్నారు. పలానా యాప్‌లో గేమ్స్ ఆడితే ఎక్కువ లాభాలంటూ ఆశ చూపిస్తూ బెట్టింగ్ వైపు దృష్టి మరల్చేలా చేస్తున్నారు. కేవలం సెలబ్రెటీలే కాకుండా టెలిగ్రామ్, వాట్సప్‌లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపిస్తోంది.


ప్రమోషన్స్‌తో మొదలుపెట్టి.. సొంతంగా

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తూ ఎంతోమంది వ్యక్తులను ఈ ఊబిలోకి దించుతున్న కొందరు తాజాగా సొంతంగా బెట్టింగ్ యాప్ నిర్వహించే స్థాయికి చేరుకున్నారు. సొంతంగా ఓ యాప్ డెవలప్ చేసి దానిని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన్పటికీ కొందరు వ్యక్తులు టెలిగ్రామ్, వాట్సప్‌ గ్రూపులలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌ను ఆపడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌కు సంబంధించి టెలిగ్రామ్‌లో రెండు ప్రధాన గ్రూపులు ఉండగా.. ఒక ఛానల్‌లో 90 వేలకు పైగా సబ్‌స్క్రైబర్లు, మరో ఛానల్‌లో 70 వేలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు.


చర్యలకు డిమాండ్

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అందరిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ బారిన పడి లక్షల్లో అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న ఘటనలు అధికంగా జరుగుతున్న వేళ.. ఈ యాప్స్ ప్రమోషన్‌తో పాటు నిర్వహకులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.


ఇవి కూడా చదవండి:

Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..

Sunita Williams Post Mission Recovery: భూమ్మీదకు సురక్షితంగా చేరిన సునీతా విలియమ్స్.. నెక్స్ట్ జరిగేది ఇదే..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 19 , 2025 | 09:27 AM