ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Akbaruddin: మంత్రికి ఇంగ్లీష్‌, హిందీ రాదు.. నాకు తెలుగు రాదు

ABN, Publish Date - Mar 27 , 2025 | 03:37 AM

మంత్రి సీతక్క కలగజేసుకుని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నదాంట్లో అర్థం లేదని, గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని మరచి పదేపదే తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు.

  • అందుకే నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: అక్బరుద్దీన్‌

  • నా మాతృభాష తెలుగు, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చా: సీతక్క

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. పాతబస్తీలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు అబ్ధిదారుల్ని ఎంపిక చేసినా.. చివరి నిమిషంలో కేటాయింపులు నిలిపి వేశారని, వారికి ఇళ్లను ఇవ్వాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కోరగా.. మంత్రి సీతక్క కలగజేసుకుని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నదాంట్లో అర్థం లేదని, గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని మరచి పదేపదే తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు.


అనంతరం అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ, తాను ప్రభుత్వాన్ని విమర్శించలేదని, తాను చెప్పింది ఒకటైతే మంత్రి మరోలా అర్థం చేసుకున్నారని అన్నారు. తనకు తెలుగు రాదని, మంత్రికి ఇంగ్లీషు, హిందీ రాదని అందుకే తన మాటల్ని ఆమె తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ట్రాన్స్‌లేషన్‌ హెడ్‌ సెట్‌ పెట్టుకుంటే వారే అనువాదం చేసి చెబుతారని సూచించారు. మంత్రి సీతక్క స్పందిస్తూ, తాను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చానని తనకు ఇంగ్లీష్‌, హిందీ రాదని అనడం సరికాదని హితవు పలికారు.

Updated Date - Mar 27 , 2025 | 03:37 AM