ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Murali: డీఎల్‌ఆర్‌ఎల్‌ డైరెక్టర్‌గా మురళి బాధ్యతలు

ABN, Publish Date - Jul 02 , 2025 | 04:19 AM

డిఫెన్స్‌ ఎలక్ట్రా‌నిక్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ(డీఎల్‌ఆర్‌ఎల్‌) డైరెక్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త మురళి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

అల్వాల్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): డిఫెన్స్‌ ఎలక్ట్రా‌నిక్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ(డీఎల్‌ఆర్‌ఎల్‌) డైరెక్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త మురళి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు శ్రీనివా్‌సరావు ఈ పదవిలో ఉన్నారు. జూన్‌ 30న(సోమవారం) ఆయన రిటైర్‌ అయ్యారు. ఆయన స్థానంలో మురళి నియమితులయ్యారు. మురళి 1988లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌లో పట్టభధ్రుడయ్యారు, 1990లో కర్ణాటకలోని మైసూర్‌ విశ్వవిదాయలయం నుంచి కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో ఎంఎస్సీ పూర్తి చేశారు. 1991 మార్చి 20న డీఎల్‌ఆర్‌ఎల్‌లో శాస్త్రవేత్తగా బాధ్యతలు చేపట్టారు. ఎలకా్ట్రనిక్‌ యుద్ధ శైలి, కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థల డిజైనింగ్‌, అభివృద్ధిలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఆయన లేస్తలేడు.. నాలుగేళ్లైతే బాబూ లేవడు వెంకయ్య, చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి వ్యాఖ్య

హైదరాబాద్‌ సిటీ, పంజాగుట్ట, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆదిలాబాద్‌ గిరిజన తండాల్లో.. వరంగల్‌ లంబాడీ తండాల్లోనో ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడాలి. ప్రతీసారి తెలంగాణ ఆత్మగౌరవం అంటూ మాట్లాడవద్దు. తెలుగువాళ్లు ఒకటిగా ఉంటే భారతదేశంలో నెంబర్‌ వన్‌గా ఉంటాం. మాజీ సీఎం రాయలసీమను రత్నాలసీమ చేస్తామన్నారు. అట్లా ఉండాలి రాజకీయ నాయకులు. మళ్లీ ఆంధ్ర చానల్‌, చంద్రబాబు చానల్‌, వెంకయ్య చానల్‌ అంటున్నారు. వెంకయ్యనాయుడు ఇంట్లో నుంచి లేవకుండా అయ్యాడు. చంద్రబాబు కూడా ఇంకో నాలుగేళ్లు అయితే లేవడు. తెలంగాణ ఎప్పటికీ ఉంటది. నిత్యనూతనమై వెలుగుతది. ఇంకేం భయం లేదు. రాజకీయ నాయకుల వల్లే ప్రమాదమున్నది. విలేకర్లు స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాలి’’ అని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘మీడియాపై దాడి అనేది అమానుషం. నీకు నచ్చని వార్తలు ప్రసారమయితే దాడి చేయడం సరికాదు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఏ పార్టీ ఆఫీసుల మీద దాడి చేయొద్దు. కలాలను భయపెట్టుకుంటూ పోతే తర్వాత వార్తలు రాసేవారు ఉండరు. ప్రతీ పార్టీ ఓ చానల్‌ పెడుతుంది. ప్రతీ పార్టీ ఒక పత్రిక కొంటుంది. ఎప్పుడైతే ఈ దరిద్రం వచ్చిందో.. రాజకీయ నాయకులకు బానిసలుగా మారుతున్నారు. నా భార్యది నెల్లూరు, సీఎం రేవంత్‌ అల్లుడిది ఆంధ్రా..! గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పార్ట్‌నర్లంతా ఆంధ్రావాళ్లు.. ప్రజలను మాత్రం సెంటిమెంట్‌తో చంపుతున్నారు. ఒకనాడు రాష్ట్రం విడిపోయింది. ఎవ్వరికో ఏదో అయితే తెలంగాణకు అయిన్నట్లు కాదు. తెలంగాణ ఆత్మగౌరవం బ్రహ్మాండంగా ఉన్నది. కొన్ని కుటుంబాలు ఇబ్బందిపడితే ఏమీ చేయలేం. కలం గళం ఎప్పుడూ భయపడకూడదు. రాజకీయ ప్రేరేపిత దాడిని ఖండిస్తున్నా. మీడియాకు స్వయం ప్రతిపత్తి ఉంచుదాం. విలేకర్లు ధైర్యంగా ఉంటే అవినీతి, అక్రమాలు బయటకొస్తాయి. మీడియాను భయపెట్టడం మంచిది కాదు. ఇకముందు తెలంగాణ పదం తక్కువగా వాడండి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ సంస్కృతి బ్రహ్మాండంగా ఉంది. కొందరు ఆడితేనే బతుకమ్మ కాదు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తెలంగాణ పదం వాడుతున్నారు. కొందరికి ఇబ్బందులు వస్తే తెలంగాణ ఆత్మగౌరవానికి ఏం సంబంధం’’ అంటూ ఆయన ప్రశ్నించారు.

Updated Date - Jul 02 , 2025 | 04:19 AM