Bandi Sanjay: సర్కారు బడి పిల్లలకు.. సైకిళ్ల కానుక
ABN, Publish Date - Jul 09 , 2025 | 06:04 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ వేదికగా ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
పుట్టిన రోజు సందర్భంగా అందించనున్న సంజయ్
నేడు కరీంనగర్‌లో 20 వేల సైకిళ్ల పంపిణీకి శ్రీకారం
హైదరాబాద్/కరీంనగర్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ వేదికగా ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు 20 వేల సైకిళ్లను అందించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా, ప్రధాని మోదీ కానుకగా ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రితోపాటు కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సహా పలువురు ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు హాజరుకానున్నారు.
Updated Date - Jul 09 , 2025 | 06:04 AM