ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sanjay Seth: దేశ భద్రతను బలోపేతం చేస్తాం

ABN, Publish Date - Jun 06 , 2025 | 03:02 AM

దేశ భద్రతను బలోపేతం చేయడానికి తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌ అన్నారు.

  • రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌

  • మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ పరిశీలన

  • వర్క్‌లోడ్‌ పెంచాలని ఉద్యోగుల వినతి

  • సానుకూలంగా స్పందించిన మంత్రి

కంది, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): దేశ భద్రతను బలోపేతం చేయడానికి తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఎద్దుమైలారం వద్దనున్న మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీని గురువారం ఆయన పరిశీలించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆయుధ కర్మాగారంలో తయారైన యుద్ధ వాహనాలు రక్షణ రంగానికి వెన్నుముకగా నిలిచాయని కొనియాడారు. దేశంలోని ఆయుధ కర్మాగారాలకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు.


ఈ సందర్భంగా ఉద్యోగులు ఫ్యాక్టరీలో వర్క్‌లోడ్‌ను పెంచాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు, ఏవీఎన్‌ఎల్‌ సీఎండీ సంజయ్‌ ద్వివేది, సీజీఎం శివశంకర ప్రసాద్‌, బీజేపీ నాయకులు నల్లా నర్సింహరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 03:02 AM