ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నగరంలో పార్థీ గ్యాంగ్‌.. నిమ్స్‌ మే, జూబ్లీహిల్స్‌లో శ్రీగంధం చెట్ల నరికివేత

ABN, Publish Date - Jun 14 , 2025 | 07:37 AM

శ్రీగంధం, ఎర్రచందనం చెట్లను నరికి బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే పార్థీ గ్యాంగ్‌ కన్ను నగరంపై పడింది. 23 మందితో కూడిన గ్యాంగ్‌ సభ్యులు 20 రోజుల క్రితం నగరానికి వచ్చి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిమ్స్‌మేతో పాటు జూబ్లీహిల్స్‌లో ఓ ఇంట్లో పెంచుకుంటున్న గంధపు చెట్లను నరికేశారు.

- నలుగురు మహిళల అరెస్టు

- పరారీలో 19 మంది ముఠా సభ్యులు

హైదరాబాద్: శ్రీగంధం, ఎర్రచందనం చెట్లను నరికి బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే పార్థీ గ్యాంగ్‌ కన్ను నగరంపై పడింది. 23 మందితో కూడిన గ్యాంగ్‌ సభ్యులు 20 రోజుల క్రితం నగరానికి వచ్చి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిమ్స్‌మేతో పాటు జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో ఓ ఇంట్లో పెంచుకుంటున్న గంధపు చెట్లను నరికేశారు. వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకొని పారిపోతుండగా జూబ్లీహిల్స్‌ పోలీసులు నలుగురు మహిళలను పట్టుకున్నారు.

19 మంది పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌(Madhya Pradesh, Rajasthan)కు చెందిన ఈ గ్యాంగ్‌లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. పురుషులు రెక్కీ నిర్వహించి నిమ్స్‌మేలో శ్రీగంధం చెట్లు ఉన్నట్లు గుర్తించారు. మహిళలు, పిల్లలు సందర్శకుల్లా వెళ్లి చెట్లను నరికి చిన్న దుంగల్లా మార్చి బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మేశారు. దీనిపై మధురానగర్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తమ మీదకు పోలీసుల దృష్టి మళ్ల లేదని భావించిన దొంగలు జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో గంధం చెట్టును నరికి అమ్మేసుకున్నారు.

దీనిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. దుంగలను తరలిస్తున్న ఆటో నంబర్‌ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించి ప్రశ్నించగా మహిళల్ని ఉప్పల్‌లో దించినట్టు చెప్పాడు. ప్రత్యేక బృందాలుగా మారిన పోలీసులు ఉప్పల్‌లో దాడులు నిర్వహించారు. పలన్‌భాయ్‌ పార్థీ, షానాజ్‌ భాయి, నిమ్మత్‌ బాయి, మాధురి పోలీసులకు చిక్కారు.

ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం మళ్లీ లక్ష

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన బాలకృష్ణ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 14 , 2025 | 07:37 AM