ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Accident: ఆహ్వాన పత్రికలను పంచేందుకు వెళ్లి.. కానరాని లోకాలకు

ABN, Publish Date - May 23 , 2025 | 04:38 AM

శుభకార్యానికి బంధువులకు ఆహ్వాన పత్రికలను అందజేసి తిరుగు ప్రయాణమైన తండ్రీకొడుకులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది.

  • రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుల దుర్మరణం

తల్లాడ, మే 22 (ఆంధ్రజ్యోతి): శుభకార్యానికి బంధువులకు ఆహ్వాన పత్రికలను అందజేసి తిరుగు ప్రయాణమైన తండ్రీకొడుకులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగింది. కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు (26) గురువారం తన బైకుపై రామచంద్రాపురం గ్రామంలోని తన మామ కత్తి వెంకటి ఇంటికి వెళ్లాడు. వేసవి సెలవులకు వెళ్లి అక్కడే ఉన్న తన పెద్ద కుమారుడు క్రిషాంత్‌ (6)ను తీసుకుని.. మల్లవరం గ్రామంలోని వారి బంధువులకు ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి వెళ్లాడు.


అక్కడి నుంచి తమ స్వగ్రామమైన చండ్రుపట్లకు బయల్దేరగా.. ఎన్టీఆర్‌ నగర్‌ వద్ద సత్తుపల్లి నుంచి జగ్గయ్యపేట వైపునకు వెళుతున్న లారీ వారి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాంబాబు అతడి కుమారుడు క్రిశాంత్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ఇద్దరూ మృతిచెందారు. రాంబాబు కల్లూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - May 23 , 2025 | 04:38 AM