Ponguleti: వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలిస్తాం
ABN, Publish Date - Jul 02 , 2025 | 05:04 AM
రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలిస్తామని, అందులోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలిస్తామని, అందులోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, అవసరమైన డాక్యుమెంట్లు, రికార్డులను భూభారతి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై సచివాలయంలో మంగళవారం సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
తిరస్కరణకు గురైన దరఖాస్తులను ఎందుకు తిరస్కరించామో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. 594 మండలాల్లో 10,226 రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 8,27,230 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు 7,98,528 దరఖాస్తులు అంటే 96.53 శాతం భూభారతి పోర్టల్‌లో నమోదు చేసినట్లు అధికారులు వివరించారు.
Updated Date - Jul 02 , 2025 | 05:04 AM