Kodangal Residential School: ఇట్లుంటది కొడంగల్ యంగ్ ఇండియా స్కూల్
ABN, Publish Date - Jul 28 , 2025 | 04:53 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా ఇది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా ఇది. భవనాలు, క్రీడా మైదానాలు అన్ని రకాల హంగులతో కొడంగల్‌లో ఇలాంటి నిర్మాణమే జరగనుంది. ఈ నమూనాను సచివాలయంలోని ఆరో అంతస్తులో సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 78 సమీకృత గురుకుల భవనాలను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. వీటికి అవసరమైన రూ.15,600 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చింది. మొదటి దశలో కొడంగల్, మధిర, హుజూర్‌నగర్‌లో నిర్మాణాలు జరుగుతాయి
- హైదరాబాద్, ఆంధ్రజ్యోతి
Updated Date - Jul 28 , 2025 | 04:53 AM