BJP: వికసిత్ తెలంగాణ బీజేపీకే సాధ్యం
ABN, Publish Date - Jul 13 , 2025 | 05:14 AM
తెలంగాణను వికసిత రాష్ట్రంగా మార్చడం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు.
ప్రజా చైతన్యంలో న్యాయవాదుల పాత్ర కీలకం
బీజేపీ మద్దతు లేకుంటే రాష్ట్ర ఏర్పాటు అసాధ్యం
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను వికసిత రాష్ట్రంగా మార్చడం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కొని ధర్మ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని, ఇందులో న్యాయవాదులు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉద్యమాల్లో న్యాయవాదులు ఎప్పుడూ ముం దుంటారని, ప్రజల్లో మళ్లీ చైతన్యం తీసుకురావడానికి వారి పాత్ర కీలకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, ఇలాంటి సర్కారును గద్దె దించాలంటే న్యాయవాదులు పెద్దసంఖ్యలో బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి చేయాలని కోరారు. బీజేపీ లీగల్‌సెల్ ఆధ్వరం్యలో శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాంచందర్‌రావుకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమ పితామహుడు కేసీఆర్ అని బీఆర్‌ఎస్ నేతలు.. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని కాం గ్రెస్ నేతలు చెప్పుకొంటున్నా.. బీజేపీ మద్దతు లేకపోతే రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు నేను, సీనియర్ అడ్వొకేట్ ప్రకాశ్ రెడ్డి, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ అడ్వొకేట్ నిరంజన్ రెడ్డి కలిసి తెలంగాణ బిల్లు కాపీలతో అరుణ్ జైట్లీని కలిశాం. ఆయన సూచనతో సుష్మా స్వరాజ్‌ను కలిసి చర్చించాం. అనంతరం ప్రకాష్ జావడేకర్‌ను కలిశాం. తెలంగాణ బిల్లు పార్లమెంటులో న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా పాస్ చేసే ప్రక్రియలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకం. తెలంగాణ సాధనలో న్యాయవాదుల పాత్రను మరువలేం’ అని రాంచందర్‌రావు అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలి: పాయల్ శంకర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్లపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
భట్టి ఆరోపణలు అప్రజాస్వామికం: నగేశ్
రాంచందర్‌రావుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యతిరేకమని బీజేపీ ఎంపీ నగేశ్ అన్నారు. రోహిత్ వేముల కేసు ఎఫ్‌ఐఆర్‌లో రాంచందర్‌రావు పేరు లేదని.. హైకోర్టు ఈ కేసును ముగించినా ఆయనపై భట్టి ఆరోపణలు చేయడం దుస్సాహసమని మండిపడ్డారు. రాంచందర్‌రావుపై భట్టి ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు
కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 13 , 2025 | 05:14 AM