ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rajgopal Reddy: రాజకీయాలంటే పదవి, అధికారం కాదు!

ABN, Publish Date - Jun 12 , 2025 | 03:54 AM

రాజకీయాలంటే పదవులు కానీ, అధికారం కానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణ.

  • ప్రజల గొంతుకను ప్రభుత్వం వరకూ తీసుకెళ్తా

  • పార్టీని బలపర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతా

  • ‘ఎక్స్‌’లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోస్టు

నల్లగొండ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘రాజకీయాలంటే పదవులు కానీ, అధికారం కానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణ. ఆ కారణంతోనే నేనే తిరిగి కాంగ్రె్‌సలోకి వచ్చా’’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని, ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం దక్కాలని కోరుకుంటున్నానని ‘ఎక్స్‌’లో ఆయన పోస్టు చేశారు. తాను ఈ రోజు మంత్రిగా లేకపోయినా పార్టీని బలపర్చడమే లక్ష్యంగా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని తెలిపారు. ప్రజల సమస్యలు వినడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకూ తీసుకెళ్లడంలో ముందుంటానని పేర్కొన్నారు. కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పని చేయడం.. శక్తిమంతంగా మారుస్తుందని, ప్రస్తుతం తాను అదే మార్గాన్ని ఎంచుకున్నానన్నారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత తొలి రోజు అందుబాటులో లేకుండా పోయిన రాజగోపాల్‌రెడ్డిని ఆ తర్వాత అధిష్ఠానం ముఖ్యులు బుజ్జగించినట్లు తెలిసింది.

Updated Date - Jun 12 , 2025 | 03:54 AM