ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజీవ్‌ యువ వికాసానికి 15.56లక్షల దరఖాస్తులు

ABN, Publish Date - Apr 15 , 2025 | 05:06 AM

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువల వచ్చాయి. మార్చి 17 నుంచి మొదలైన ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది.

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువల వచ్చాయి. మార్చి 17 నుంచి మొదలైన ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. చివరి రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు అధికారుల లెక్కల ప్రకారం 15.56 లక్షల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.


రాత్రి10 గంటల వరకు 15.95 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఒక్క రోజే దాదాపు 2 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రికి ఈ సంఖ్య 16.50 లక్షలు దాటిపోతుందని అంచనా. ఈ నెల 20వ తేదీ నుంచి మే 20 వరకు మండల స్థాయిలో నెల రోజుల పాటు దరఖాస్తులను పరిశీలన చేస్తారు.

Updated Date - Apr 15 , 2025 | 05:06 AM