GM Sandeep Mathur: లెవల్ క్రాసింగ్ గేట్లపై దృష్టి కేంద్రీకరించాలి
ABN, Publish Date - Jul 09 , 2025 | 07:19 AM
ప్రమాదాలకు ఆస్కారం ఉన్న నాన్ ఇంటర్‌లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఎల్.సిలు రైళ్ల రాకపోకలపై ప్రత్యేక దృష్టి..
తనిఖీలు ముమ్మరం చేయాలి: రైల్వే జీఎం సందీప్ మాథుర్
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ప్రమాదాలకు ఆస్కారం ఉన్న నాన్-ఇంటర్‌లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద(ఎల్.సిలు)రైళ్ల రాకపోకలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ అధికారులను ఆదేశించారు. జోన్ పరిధిలోని ఎల్‌సీలను గుర్తించి ట్రాఫిక్ భద్రత కోసం తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో రైళ్ల భద్రతపై నిర్వహించిన సమీక్ష లో జోన్ అదనపు జీఎం నీరజ్ అగ్రవాల్‌తో పాటు వివిధ వి భాగాల ప్రధానాధిపతులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జోన్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు,గుంటూరు, నాందేడ్ డివిజన్ల రైల్వే మేనేజర్లతో సందీప్ మాథుర్ మాట్లాడుతూ.. రైళ్ల భద్రత కార్యకలాపాల్లో సమన్వయంతో వ్యవహరించాలన్నారు. రైలు ప్రమాదాల కు దారితీసే అవకాశమున్న లోడింగ్‌ను నివారించడానికి సిబ్బందిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా పశువులు ట్రాక్‌లపైకి వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి కంచెల నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
Updated Date - Jul 09 , 2025 | 07:19 AM