ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raghu Nandan Rao: జూన్‌ 2న కవిత కొత్త పార్టీ పెట్టొచ్చు

ABN, Publish Date - May 28 , 2025 | 07:28 AM

కవిత షర్మిలలా పాదయాత్ర చేసి జూన్‌ 2న కొత్త పార్టీ స్థాపించవచ్చని రఘునందన్‌రావు చెప్పారు. ఆయన ఈ ప్రక్రియపై ప్రశ్నలు వేసి, బీసీల అవమానం, సామాజిక సమస్యలపై ఆమె మాటలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • షర్మిలక్కలా పాదయాత్ర చేస్తుందేమో..?: రఘునందన్‌రావు

తూప్రాన్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘షర్మిలక్క చేసినట్లు పాదయాత్ర చేద్దామని, కొత్త పార్టీ పెట్టుకుందామని కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతుంది. బహుశా జూన్‌ 2న ఆమె కొత్త పార్టీ పెట్టొచ్చు’ అని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రీకూతురు.. అన్నాచెల్లెల కొట్లాట.. ఏమైందో పక్క (ఏపీ) రాష్ట్రంలో చూశామని, ఈ రాష్ట్రంలో గదే అయితదని వ్యాఖ్యానించారు. గతంలో అక్క(షర్మిల) చెప్పింది కదా.. పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని, ఇప్పుడు చెల్లె (కవిత) ఈ రాష్ట్రంలో కూడా పాదయాత్ర చేస్తుండొచ్చని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ అనో.. మహిళలకు అన్యాయం జరిగిందనో.. కవిత మాట్లాడితే బాధ అనిపిస్తదని అన్నారు. బీసీలకు అవమానం జరిగిందని ఈరోజు కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు దేవుళ్లు.. దయ్యాల గురించి మాట్లాడుతున్నారని, పన్నెండేళ్లుగా ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదని రఘునందన్‌ ప్రశ్నించారు.

Updated Date - May 28 , 2025 | 07:29 AM