ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన విశ్వవిద్యాలయం తొలి వీసీగా ప్రొఫెసర్‌ వై.ఎల్‌. శ్రీనివాస్‌

ABN, Publish Date - Mar 12 , 2025 | 03:49 AM

ఫెసర్‌ వై.ఎల్‌. శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ఈయన విద్య, పరిపాలన రంగంలో విశేష అనుభవం గడించారు.

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి వైస్‌ఛాన్సలర్‌గా ప్రొఫెసర్‌ వై.ఎల్‌. శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ఈయన విద్య, పరిపాలన రంగంలో విశేష అనుభవం గడించారు. 1992లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన వై.ఎల్‌. ఓయూ ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సె్‌సతో పాటు ఓయూ మహిళా కళాశాలలో పనిచేశారు. 2019 నుంచి 2021 వరకు ఓయూ ఇంగ్లీషు విభాగం బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, ఆ తర్వాత ఇంగ్లీషు విభాగం అధిపతిగా పనిచేశారు. 2021 డిసెంబరులో ఇఫ్లూ(ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్శిటీ)లో చేరిన వై.ఎల్‌. స్కూల్‌ ఆఫ్‌ లిటరరీ స్టడీస్‌, ఇంగ్లీషు లిటరేచర్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.


హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు విభాగం బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సభ్యుడిగా, ఆరోరా ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి అకాడమీలో వైస్‌ఛాన్సలర్‌గా ఆయన ప్రస్తుతం కొనసాగుతున్నారు. శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు. నేషనల్‌ అసె్‌సమెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌(న్యాక్‌)కు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగాను పనిచేశారు. వీసీగా నియమితులైన ప్రొఫెసర్‌ వై.ఎల్‌. శ్రీనివా్‌సకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం గిరిజన విశ్వవిద్యాలయం పురోభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు.

Updated Date - Mar 12 , 2025 | 03:49 AM