ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Electricity: 10 గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్..

ABN, Publish Date - Jul 12 , 2025 | 07:13 AM

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలో శనివారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ శిల్పారామం, నాక్‌గ్రౌండ్‌, ఏపీఐసీసీ-1,2, యూసుఫ్‏గూడ ప్రత్యేక పోలీస్‌ మొదటి బెటాలియన్‌ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

  • నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: బంజారాహిల్స్‌ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలో శనివారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ శిల్పారామం, నాక్‌గ్రౌండ్‌, ఏపీఐసీసీ-1,2, యూసుఫ్‏గూడ ప్రత్యేక పోలీస్‌ మొదటి బెటాలియన్‌, రహ్మత్‌ నగర్‌ బంగారు మైసమ్మ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మ ధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ మాదాపూర్‌, శిల్పావ్యాలీ, అన్నపూర్ణ స్టూడియో ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలో..

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్‌ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ ఎస్‌ ఆర్‌నగర్‌ ఐఏఎస్‌ క్వార్టర్స్‌ ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎస్‌ మక్తా ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

చిక్కడపల్లి: ఆజామాబాద్‌ డివిజన్‌, హైదరాబాద్‌ సిటీ-1 పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్‌ తెలిపారు. అంబర్‌పేట, షాదాన్‌ కాలేజ్‌ పరిధిల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, బౌద్దనగర్‌ పరిఽఽధిలో 11 నుంచి 11.30 వరకు, ప్లేగ్రౌండ్‌, జెడ్‌పీ ఆఫీస్‌, లేక్‌వ్యూ ఎస్‌ఎస్‌ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాఉండదని పేర్కొన్నారు.

రామంతాపూర్‌: రామంతాపూర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని ఫీడర్‌లలో ఈనెల 12న శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ కూతాడి లావణ్య తెలిపారు. విశాల్‌ ఫీడర్‌లోని విశాల్‌ బిల్డింగ్‌, గణే్‌షనగర్‌, అరోరా కళాశాల, గుప్తా గార్డెన్‌, బ్రహ్మంగారి ఆలయం వీధి, సాయి గార్డెన్‌, దూరదర్శన్‌ క్వార్టర్స్‌లలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు గోఖలేనగర్‌ ఫీడర్‌లోని ప్రగతీనగర్‌, మెయిన్‌ రోడ్డు, డిమార్ట్‌, మెట్ల వీధి, ఇందిరాఇనగర్‌, హెచ్‌పీ గ్యాస్‌, బజాజ్‌, క్రోమా, రిలయన్స్‌, మ్యాట్రిక్‌ ఆస్పత్రి ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు.

చర్లపల్లి సబ్‌ స్టేషన్‌ పరిధిలో..

కుషాయిగూడ: విద్యుత్‌ లైన్‌ల మార్పులు, ఇతర మరమ్మతుల కారణంగా శనివారం వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు చర్లపల్లి సబ్‌ స్టేషన్‌ ఏఈ టి.బాలరాజు తెలిపారు. సాయినగర్‌ ఫీడర్‌ పరిధిలోని ఎంఆర్‌ఆర్‌ కాలనీ, సాయినగర్‌, నాగార్జున నగర్‌కాలనీ, చక్రిపురం కాలనీలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కరెంటు సరఫరా ఉండదని తెలిపారు.

బోడుప్పల్‌ పరిధిలో..

ఉప్పల్‌: చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర మరమ్మతుల కారణంగా శనివారం వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు బోడుప్పల్‌ సబ్‌స్టేషన్‌ ఏఈ ఎన్‌.వేణుగోపాల్‌ తెలిపారు. బృందావన్‌ కాలనీ ఫీడర్‌ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, సాయి మారుతీ నగర్‌, ఉదయ లక్ష్మినగర్‌, కేశవనగర్‌, ఎన్‌టీఆర్‌ విగ్రహం నుంచి సిద్ధార్థ స్కూల్‌ మెయిన్‌ రోడ్డు, బృందావన్‌ కాలనీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కరెంటు సరఫరా ఉండదని వెల్లడించారు. అదే విధంగా సరస్వతీ నగర్‌ ఫీడర్‌ పరిధిలోని సరస్వతీనగర్‌, శ్రీ నగర్‌, విజయపురి కాలనీ, శ్రీలక్ష్మి నగర్‌, అశోక్‌ నగర్‌, ప్రశాంత్‌ నగర్‌లలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.

గౌతంనగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో..

మల్కాజిగిరి: గౌతంనగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని 11 కేవీ హన్మాన్‌పేట్‌ ఫీడర్‌ పరిధిలో విద్యుత్‌ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు గౌతంనగర్‌, లెప్ట్‌ మల్లికార్జుననగర్‌, లెప్ట్‌ హన్మాన్‌పేట్‌, 11 కేవీ ఐఎన్‌ నగర్‌ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఐఎన్‌నగర్‌, గోపాల్‌నగర్‌, అన్నపూర్ణ సొసైటీ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

వసంతపురి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో..

వసంతపురి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని 11 కేవీ గీతాభవానీ ఫీడర్‌ పరిధిలో ఉదయం 10 నుంచి 10.30 వరకు వెంకటేశ్వరనగర్‌, దుర్గానగర్‌, పటేల్‌నగర్‌, ఎస్పీనగర్‌, హైదర్‌నగర్‌లలో, రాఘవేంద్ర ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 2.30 వరకు మారుతీనగర్‌, నర్సింహరెడ్డినగర్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాఉండదని ఏఈ గోపాల్‌ తెలిపారు.

గాజులరామారం: ఉషాముళ్లపూడి విద్యుత్‌ సబ్‌-స్టేషన్‌ పరిధిలోని ఈ కింది ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామని ఏఈ చైతన్య భార్గవ్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు శ్రీరామ్‌నగర్‌-ఏ,బీ, బేకరిగడ్డ, ఎన్టీఆర్‌నగర్‌, ఎస్‌సీబీనగర్‌, జహంగీర్‌బస్తీ, అంబేడ్కర్‌నగర్‌, ఉమాదేవినగర్‌, చంద్రగిరినగర్‌, భాస్కర్‌బస్తీల్లో కరెంట్‌ ఉండదన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యండమూరి లే-అవుట్‌లో విద్యుత్‌ ఉండదన్నారు.

కొంపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో..

పేట్‌బషీరాబాద్‌: కొంపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని ఈ క్రింది ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్న 12గంటల వరకు సాయిబాబా కాలనీ, గాంధీవిగ్రహం, కృష్ణా నగర్‌కాలనీ, కుమ్మరి బస్తీ, సంజనబ్లాక్స్‌ పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండన్నారు. మధ్యాహ్న 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గంగస్ధాన్‌, అన్నాదాబా, 120 గజాలు, సొసైటీ బ్యాంక్‌, దూలపల్లి విలేజ్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు.

హైదర్‌నగర్‌: వెస్ట్రన్‌హిల్స్‌ విద్యత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అడ్డగుట్ట, శాతవాహననగర్‌, సమతానగర్‌, జలవాయువిహార్‌లో విద్యుత్‌ ఉండదని అధికారులు తెలిపారు. ఎల్లమ్మబండ ఫీడర్‌ పరిధిలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఎల్లమ్మబండ, మహంకాళినగర్‌, ఇందిరానగర్‌ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏపీపీ పద్మజ హాస్పిటల్‌, అడ్డగుట్ట వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతం, కళామందిర్‌ రోడ్డులో విద్యుత్‌ ఉండదన్నారు.

మియాపూర్‌: గోకరాజు రంగరాజు 11కెవీ, ప్రశాంత్‌నర్‌ 11కెవీ, మయూరినగర్‌ 11కెవీ, గౌతమినగర్‌ 11కెవీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రవిచంద్ర తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి.

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 12 , 2025 | 07:13 AM