ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam: మోదీ మెగా ఫెయిల్యూర్‌ మాటేంది?

ABN, Publish Date - Jul 07 , 2025 | 02:33 AM

గడిచిన 11 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు అణా పైసా తేలేని బీజేపీ నేతలు.. తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

  • రామచందర్‌రావుకు మంత్రి పొన్నం ప్రశ్న

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): గడిచిన 11 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు అణా పైసా తేలేని బీజేపీ నేతలు.. తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సీఎం రేవంత్‌కు లేఖలు రాయడం కాదని, ముందు మోదీ సర్కారు మెగా ఫెయిల్యూర్‌ మాటేందో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావును ప్రశ్నించారు.

వాగ్దానాలతో ఊదరగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప మోదీ సర్కారు చేసిందేమీ లేదన్నారు. అన్ని వర్గాలనూ మోసం చేసిన చరిత్ర మోదీ సర్కారుదని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. 60 ఏళ్లు దాటిన సన్న చిన్నకారు రైతులకు పింఛన్లు ఇస్తామన్నారని, కిసాన్‌ సమ్మాన్‌ నిధిని పెంచుతామన్నారని, వాటిని అమలు చేశారా? అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - Jul 07 , 2025 | 02:33 AM