ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: భూభారతి రైతులకు రక్షణ కవచం

ABN, Publish Date - May 05 , 2025 | 04:10 AM

తెలంగాణ భూపరిపాలనలో నూతన అఽధ్యాయానికి నాంది పలికిన భూభారతి చట్టం రైతులకు రక్షణ కవచమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

  • నేటి నుంచి మరో 28 మండలాల్లో అమలు

  • కలెక్టర్లు రైతుల సందేహాలను నివృత్తి చేయాలి: పొంగులేటి

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భూపరిపాలనలో నూతన అఽధ్యాయానికి నాంది పలికిన భూభారతి చట్టం రైతులకు రక్షణ కవచమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత నెల 17 నుంచి 30 వరకు 4 జిల్లాల్లోని 4 మండలాల్లో భూభారతిని పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించామని తెలిపారు. సోమవారం నుంచి 20 వరకు జిల్లాకొక మండలం చొప్పున మిగతా 28 మండలాల్లోనూ ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ప్రజాకోణంలో తీసుకొచ్చిన ఈ భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటి పరిష్కారమే సదస్సుల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కలెక్టర్లు జిల్లాల్లో రెవెన్యూ సదస్సులకు హాజరై అక్కడ రైతులు, ప్రజల సందేహాలను నివృత్తి చేసి సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో అధ్యయనంతో తెచ్చిన భూభారతి చట్టాన్ని క్షేత్రస్ధాయికి సమర్థంగా తీసుకెళ్లాలని కలెక్టర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

Updated Date - May 05 , 2025 | 04:10 AM