ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pidamarthi Ravi: వర్గీకరణ వ్యతిరేక పిటిషన్‌ వెనుక మంద కృష్ణ

ABN, Publish Date - May 19 , 2025 | 04:07 AM

వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య వేసిన పిటిషన్‌ వెనక ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ హస్తం ఉందని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి ఆరోపించారు.

  • పిడమర్తి రవి

బర్కత్‌పుర, మే 18 (ఆంధ్రజ్యోతి) : వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య వేసిన పిటిషన్‌ వెనక ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ హస్తం ఉందని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి ఆరోపించారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదిగలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించి వర్గీకరణ అమలు చేస్తున్నారని దీన్ని ఓర్వలేకనే జి. చెన్నయ్య హైకోర్టులో కేసు వేశారని మందకృష్ణ మాదిగ కన్నుసన్నల్లోనే చెన్నయ్య ఈ కేసు వేశాడని ఆయన ఆరోపించారు.


రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓర్వలేకనే మందకృష్ణ ఈ పని చేశారని, భవిష్యత్‌లో బీజేపీని బలోపేతం చేయడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జూన్‌ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - May 19 , 2025 | 04:07 AM