DSR App: డీఎస్‌ఆర్ యాప్ మాకొద్దు!
ABN, Publish Date - Jun 07 , 2025 | 05:13 AM
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన రోజువారీ పారిశుధ్య నివేదిక (డీఎ్‌సఆర్) యాప్ రద్దు కోసం పంచాయతీ కార్యదర్శులు పోరాటబాట పట్టారు.
కొత్త మార్గదర్శకాలతో మాకు మరిన్ని ఇబ్బందులు.. యాప్‌ను రద్దు చేయకుంటే మూకుమ్మడి సెలవులు
ప్రభుత్వానికి పంచాయతీ కార్యదర్శుల అల్టిమేటం
20 రోజులుగా యాప్‌లో వివరాల అప్‌డేట్‌కు దూరం
హైదరాబాద్, పెద్దపల్లి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన రోజువారీ పారిశుధ్య నివేదిక (డీఎ్‌సఆర్) యాప్ రద్దు కోసం పంచాయతీ కార్యదర్శులు పోరాటబాట పట్టారు. గత 20 రోజులుగా హాజరు, ప్రభుత్వం సూచించిన పథకాలు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు, ఫొటోలను యాప్‌లో నమోదు చేయడం లేదు. దీంతో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఈ రోజులను సీఎల్‌గా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ తరుణంలో ఈ యాప్‌ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే మూకుమ్మడిగా సెలవులు పెడతామని కార్యదర్శులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 9 వేల మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. వీరంతా ఆందోళన బాట పట్టడంతో గ్రామాల్లో నిత్యం చేపట్టే పనులపై ప్రభావం పడుతోంది. తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్, తెలంగాణ పంచాయతీ సెక్రటరీ సెంట్రల్ ఫోరం, తెలంగాణ పంచాయతీ సెక్రటరీల ఫోరం.. ఈ మూడు సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పంచాయతీ కార్యదర్శుల్లో పారదర్శకతను పెంచేందుకు గత ప్రభుత్వం ఈ యాప్‌ను రూపొందించింది. అయి తే, ఇందులో కొన్ని లోపాల కారణంగా యాప్‌ను దుర్వినియోగం చేస్తూ కార్యదర్శులు విధులకు గైర్హాజరవుతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీంతో గత నెల 24న కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఫేస్ రికగ్నైజేషన్‌తో యాప్‌ను పకడ్బందీగా నిర్వహిస్తోంది. కార్యదర్శులు ఫేస్ రికగ్నైజేషన్‌తో ఫొటోను అప్‌లోడ్ చేయాలని, ఇతర వివరాలను ఫొటోలతో సహాఅ్‌పలోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో ఎక్కడి నుంచైనా వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా.. ప్రతిరోజూ ఉదయం 11గంటలలోపు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్, ఇతర నివేదికలతోపాటు రోజువారీగా ఇళ్ల నుంచి సేకరించే చెత్త ఎన్ని కిలోలన్న దానిపై వివరాలను చేర్చాలని నిర్ణయించారు. అయితే, కొత్త మార్గదర్శకాల వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన పని భారం
అసలే పంచాయతీల్లో పాలకవర్గాలు లేక పని భారం అంతా తమ మీదనే పడుతున్నదని, చిన్న చిన్న పనులకు డబ్బులను సొంతంగా పెడుతున్నామని, ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీపరంగా 35 రికార్డులను నిర్వహించాల్సి ఉంటుందని, దీనికి తోడు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన యాప్‌ల నిర్వహణ బాధ్యతలు కూడా తమపైనే ఉన్నాయని వారంటున్నారు. ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా యాప్‌లో ఫేస్ రికగ్నైజ్ అటెండెన్స్ నిబంధన తమకే ఎందుకు పెట్టారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పైగా 2011 జనాభా లెక్కల ప్రకారమే కార్యదర్శులు ఉన్నారని, జనాభాకు తగ్గట్లుగా కార్యదర్శులను నియమించకపోవడంతో తమకు పని భారం పెరిగిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శాఖాపరమైన నిర్ణయాల పట్ల నిర్లక్ష్యం తగదు
సచివాలయంలో ఉన్నతాధికారులు సైతం బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తారు.. అదేవిధానంలో గ్రామ సచివాయలంలో పనిచేసే కార్యదర్శులను కూడా డీఎ్‌సఆర్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ వేసేలా సాఫ్ట్‌వేర్ రూపొందించాం. ఇందులో సమాచారం ఇతరులకు చేరే అవకాశం లేనేలేదు. కానీ, కార్యదర్శులు పలు అపోహలతో యాప్‌ను వ్యతిరేకిస్తున్నారు. శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాలను పాటించకుండా.. నిర్లక్ష్యం వహించడం మంచి పద్ధతి కాదు. డీఎ్‌సఆర్ యాప్‌లో వివరాల నమోదుకు మూడురోజులు గడువు ఇచ్చాం.. ఎలా స్పందిస్తారో చూడాలి.
- గుమ్మళ్ల సృజన, డైరెక్టర్- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ.
థర్డ్ పార్టీ ద్వారా యాప్ నిర్వహించడం భద్రతకు ముప్పు
డీఎ్‌సఆర్ యాప్‌ను థర్డ్ పార్టీ ద్వారా నిర్వహిస్తున్నారు. కార్యదర్శుల్లో 40 -50శాతం మహిళా కార్యదర్శులు పనిచేస్తున్నారు వారి వ్యక్తిగత వివరాలు థర్డ్ పార్టీ యాప్ ద్వారా ేసకరిస్తే.. వారి భద్రతకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పంచాయతీ కార్యదర్శుల ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉంది.. అందుకే ఈ యాప్‌ను వ్యతిరేకిస్తున్నాం.
- శ్రీకాంత్‌గౌడ్, అధ్యక్షుడు, తెలంగాణ పంచాయతీ సెక్రటరీల ఫోరం
ఈ వార్తలు కూడా చదవండి..
తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై దాడి.. స్వల్ప గాయాలు
బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 07 , 2025 | 05:13 AM