ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NFC: ఐదున్నర దశాబ్దాల అణు బంధం.. అణు ఇంధన సంస్థకు యాభై ఆరు వసంతాలు

ABN, Publish Date - Jun 06 , 2025 | 09:41 AM

న్యూక్లియర్‌ ఫ్యూయెల్‌ కాంప్లెక్స్‌.. గత యాభై ఆరు సంవత్సరాల క్రితం నెలకొల్పిన ఈ కర్మాగారం భారతదేశానికే తలమానికంగా నిలుస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలోని అణు ఇంధన శాఖలకు ఊపిరిగా నిలుస్తున్న ఈ సంస్థ ఏర్పాటై యాభై ఆరు వసంతాలు నిండాయి. ఈ సందర్బంగా ఓ ప్రత్యేక కథనం..

  • 8న ‘ఎన్‌ఎఫ్‏సీ-డే’

  • గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు చురుకుగా ఏర్పాట్లు

  • నేడు ముందస్తు వేడుకలు

సికింద్రాబాద్: స్వతంత్ర భారతావనిలో అణు ఇంధన అవసరాలను తీరుస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తోంది నగరంలోని అణు ఇంధన సంస్థ (న్యూక్లియర్‌ ఫ్యూయెల్‌ కాంప్లెక్స్‌). పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలోని అణు ఇంధన శాఖలకు ఊపిరిగా నిలుస్తున్న ఈ సంస్థ ఏర్పాటై యాభై ఆరు వసంతాలు నిండాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 6న ముందస్తు వేడుకలకు సమాయత్తమవుతోంది. వేల ఎకరాల భూమిని సేకరించి 1969లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. ముడి ఇంధనంగా లభించే యురేనియం, జిర్కోనియం, ఫ్లుటోనియం తదితర అణు ఇంధనాన్ని శుద్ధి చేసి వేర్వేరు అణు ఇంధన శాఖలకు సరఫరా చేస్తోంది.


మొదట్లో విదేశాల సహకారం తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అణు ఇంధనాన్ని పొందుపరచి ఇస్తోంది. ముఖ్యంగా అణు రియాక్టర్ల తయారీలోను, దేశ రక్షణతో ముడిపడి ఉన్న ఆయా శాఖలతోను సమన్వయంతో పనిచేస్తూ అందరి మన్ననలను అందుకుంటోంది. కాగా, సంస్థ 1973లో మొట్టమొదట వెలువరించిన ఉత్పత్తికి గుర్తుగా ప్రతి యేడాది జూన్‌ 8వ తేదీని ‘ఎన్‌ఎఫ్‏సీ-డే’గా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


పటిష్ట భద్రత

దేశంలోని అతి కీలకమైన సంస్థల్లో ఎన్‌ఎఫ్‏సీ కూడా ఒకటి. సీఐఎస్ఎఫ్‌ బలగాల పర్యవేక్షణలో నిత్యం పహరా ఉంటుంది. సంస్థలో దాదాపు ఐదు వేలమంది అధికార, ఉద్యోగ, సిబ్బంది పనిచేస్తుండగా, మరో ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఎన్‌ఎఫ్‏సీ-డే పురస్కరించుకొని ఈనెల 6న డాక్టర్‌ హోమి.జె.బాబా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉద్యోగ, కార్మికులతో కలిసి నిర్వహించే ముందస్తు వేడుకలకు అణు ఇంధన కమిషన్‌ ప్రతినిధులు, కేంద్ర అణు ఇంధన విభాగం ప్రతినిధులు, దేశ వ్యాప్తంగా వివిధ అణు ఇంధన విభాగాల ప్రతినిధులు హాజరు కానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..

బనకచర్లపై ఉత్తమ్‌, కవిత తప్పుడు ప్రచారం: బక్కని

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 09:41 AM