పేలుళ్ల కుట్ర కేసులో మరో ఇద్దరి అరెస్టు
ABN, Publish Date - May 30 , 2025 | 05:23 AM
పేలుళ్ల కుట్ర కేసులో ఎన్‌ఐఏ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరితో ఇంకా ఎవరెవరితో లింకులు ఉన్నాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్/విజయనగరం, మే 29 (ఆంధ్రజ్యోతి): పేలుళ్ల కుట్ర కేసులో ఎన్‌ఐఏ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరితో ఇంకా ఎవరెవరితో లింకులు ఉన్నాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు విజయనగరంలో టిఫిన్ బాక్స్ బాంబులను పేల్చాలని కుట్రలు చేసిన సిరాజ్, సమీర్‌లను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో వరంగల్‌కు చెందిన ఫర్హాన్ మొహియుద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాదర్, మరికొందరితో సిరాజ్‌కు పరిచయాలున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.
అల్-హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పేరుతో ఓ గ్రూపును ప్రారంభించినట్లు ఎన్‌ఐఏ ఇప్పటికే నిగ్గుతేల్చింది. పలువురు యువకులను సిరాజ్ ఈ గ్రూపులో చేర్చినట్టుగా నిర్ధారించింది. తాజాగా అరెస్టయిన ఫర్హాన్, కాజీపేటకు చెందిన మరో యువకుడిని ఎన్‌ఐఏ గురువారం అరెస్టు చేసింది. వీరిద్దరి సోషల్ మీడియా ఖాతాలను జల్లెడపడుతోంది.
Updated Date - May 30 , 2025 | 05:23 AM