ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CPI: పాలకుల నిర్లక్ష్యం వల్లే చేనేత నిర్వీర్యం: కూనంనేని

ABN, Publish Date - May 27 , 2025 | 04:34 AM

పాలకుల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యం గల చేనేత రంగం నిర్వీర్యమవుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): పాలకుల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యం గల చేనేత రంగం నిర్వీర్యమవుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత పరిరక్షణకు ప్రత్యేక నిధుల కేటాయింపుతోపాటు వృత్తి ఆధునీకరణకు సహకరించాలని సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు.


ఎస్సీ సబ్‌ ప్లాన్‌ తరహాలో కుల వృత్తుల సంరక్షణ కోసం చేనేత రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కూనంనేని కోరారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో దాటవేత ధోరణి మంచిది కాదన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పాలకులకు ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప వృత్తిదారుల సమస్యలు పట్టవన్నారు.

Updated Date - May 27 , 2025 | 04:34 AM