Kishan Reddy: స్వర్ణయుగానికి పదకొండేళ్లు
ABN, Publish Date - Jun 11 , 2025 | 07:47 AM
స్వతంత్ర భారతావనిలో స్వర్ణయుగానికి సాక్ష్యంగా గత పదకొండేళ్ల ఎన్డీయే పాలన నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
మోదీ పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): స్వతంత్ర భారతావనిలో స్వర్ణయుగానికి సాక్ష్యంగా గత పదకొండేళ్ల ఎన్డీయే పాలన నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పదకొండేళ్ల ఎన్డీయే పాలన, దేశ ప్రగతిపై ఆయన మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఆర్థిక ప్రగతి, అన్నదాతల సంక్షేమం, జాతీయ భద్రత, వైద్య-విద్యా రంగాల్లో మార్పులు, మహిళా సాధికారత, యువతకు ఉద్యోగాలు, ఉపాధి, పేదరికం తగ్గుదల, సామాజిక సంస్కరణలు, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి మోదీ పాలనలో సాధ్యమైందని వివరించారు. 2014 నాటికి దేశం ఆర్థికంగా అట్టడుగున, అవినీతిలో అగ్రభాగాన ఉందని.. సమర్థవంత నాయకుడైన మోదీ అధికారం చేపట్టిన తర్వాత దేశ దిశ మారిందని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Jun 11 , 2025 | 07:48 AM