Heavy Showers Expected: పలు జిల్లాల్లో మోస్తరు వర్షం
ABN, Publish Date - Jul 20 , 2025 | 02:00 AM
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు వర్షం పడింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం సంగారెడ్డి జిల్లా..
హైదరాబాద్‌లో జలమయమైన రోడ్లు
పాలమూరు, కొత్తగూడెం జిల్లాల్లో పిడుగుపాటుకు గురై ఇద్దరి దుర్మరణం
నేడు, రేపు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు వర్షం పడింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో అత్యధికంగా 11 సెం.మీరంగారెడ్డి జిల్లా చేవేళ్లలో 11 సెం.మీ, యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక, రాజధాని హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి పలు ప్రాంతా ల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అత్యధికంగా కాప్రాలో 7.7 సెం.మీ ఉప్పల్‌లో 6.8 సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. సాయం త్రం ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్, మల్కాజిగిరి, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్, సరూర్‌నగర్, హయత్‌నగర్, కాప్రా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మన్సురాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వరద చేరడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, మహబూబ్‌నగర్‌లోని న్యూమోతీనగర్‌కు చెందిన సమ్మయ్య(16), కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం వెంకట తండాలో యువ రైతు బాణోత్ రవి(33) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదురోజుల పాటు వర్షా లు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఆది, సోమవారాల్లో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడనున్నాయని, ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News
Updated Date - Jul 20 , 2025 | 02:00 AM