ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Kavitha: ‘సిగాచి’ ప్రమాదం కలచివేసింది: కవిత

ABN, Publish Date - Jul 02 , 2025 | 04:43 AM

సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎమ్మెల్సీ కవిత మంగళవారం పరామర్శించారు.

పటాన్‌చెరు, జులై 1(ఆంధ్రజ్యోతి): సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎమ్మెల్సీ కవిత మంగళవారం పరామర్శించారు. పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. డాక్టర్లను కలిసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దారుణమైన ప్రమాదంలో కార్మికులు, ఉద్యోగులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని కవిత అన్నారు.

ప్రభుత్వం బాధితులకు సంపూర్ణ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వారికి మెరుగైన వైద్యం అందించి, కోలుకునేవరకు వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా అధికారులు, ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదంలో చనిపోయిన వారికి కవిత ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Jul 02 , 2025 | 04:43 AM