ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam Kumar Reddy: ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సెల్యూట్‌: ఉత్తమ్‌

ABN, Publish Date - May 09 , 2025 | 03:26 AM

ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ సైన్యం చేస్తున్న పోరాటం అనన్యమైందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

కోదాడటౌన్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ సైన్యం చేస్తున్న పోరాటం అనన్యమైందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉగ్రవాదుల తొమ్మిది స్థావరాలను ఏక కాలంలో ధ్వంసం చేసి, త్రివిధ దళాలు తమ సత్తాను ప్రపంచానికి చాటడం గొప్ప విషయమన్నారు. పాకిస్థాన్‌కు ఇదే సరైన గుణపాఠం అని పేర్కొన్నారు.


భారత వైమానికదళంలో పని చేసిన అనుభవం తనకు ఉందని, అందులోనూ యుద్ధ విమానాల పైలెట్‌గా యుద్ధ సమయంలో పని చేసిన అనుభవాన్ని మంత్రి ఉత్తమ్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Updated Date - May 09 , 2025 | 03:26 AM