ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Surekha: కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి సురేఖ

ABN, Publish Date - Jun 06 , 2025 | 02:54 AM

మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన క్యాబినెట్‌ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి అక్కడికి చేరుకున్నారు.

  • క్యాబినెట్‌ భేటీకి ముందు స్వల్ప అస్వస్థత

  • పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన క్యాబినెట్‌ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి అక్కడికి చేరుకున్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి సురేఖను పరామర్శించారు. విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు సూచించారు.


వైద్యులు, సీఎం సూచన మేరకు సురేఖ ఇంటికి వెళ్లిపోయారు. తన ఆరోగ్యం విషయంలో ప్రజలు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. వరస భేటీలు, క్యాబినెట్‌ సమావేశం నేపథ్యంలో ఆయా శాఖల నుంచి సమాచారం సేకరించడం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సరైన ఆహారం, విశ్రాంతి లేక స్వల్ప అస్వస్థతకు గురైనట్లు ప్రకటించారు.

Updated Date - Jun 06 , 2025 | 02:54 AM