ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Komatireddy: నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

ABN, Publish Date - Jun 23 , 2025 | 04:16 AM

రహదారుల, భవనాల (ఆర్‌ అండ్‌ బీ) శాఖ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

  • ఆర్వోబీలు, మెడికల్‌ కాలేజీలు, టిమ్స్‌పై దృష్టి పెట్టండి

  • అధికారులకు మంత్రి కోమటి రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : రహదారుల, భవనాల (ఆర్‌ అండ్‌ బీ) శాఖ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. త్వరగా పూర్తయి వాడుకలోకి వచ్చేవాటికి మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న 5 జిల్లా సమీకృత కార్యాలయాల (ఆదిలాబాద్‌, వరంగల్‌, ములుగు, నారాయణపేట, కరీంనగర్‌) పనుల పురోగతిపై మంత్రి ఆరా తీయగా.. పెండింగ్‌ బిల్లుల అంశాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

పనులు తుది దశలో ఉన్న వరంగల్‌, ములుగు జిల్లా కలెక్టరేట్లు వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్థం చేయాలని చెప్పారు. ఆర్వోబీల నిర్మాణంపై ఆరా తీసిన మంత్రి..నిజామాబాద్‌ మాధవనగర్‌ ఆర్వోబీ పెండింగ్‌ పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్థం చేయాలని సూచించారు. నిర్మాణం చివరి దశలోఉన్న ఆర్వోబీలు, మెడికల్‌ కాలేజీలు, టిమ్స్‌ హాస్పిటల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. వర్క్‌ ఏజెన్సీలకు, కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులపై సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యుటీ సీఎం భట్టితో మాట్లాడి క్లియర్‌ చేయిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.

Updated Date - Jun 23 , 2025 | 04:16 AM