ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: ‘సిగాచి’ ప్రమాదం అత్యంత బాధాకరం

ABN, Publish Date - Jul 02 , 2025 | 04:16 AM

పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందటం అత్యంత బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

  • బాధితులను ఆదుకుంటాం: కిషన్‌రెడ్డి

పటాన్‌చెరు రూరల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందటం అత్యంత బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం దురదృష్టకరమన్నారు. మంగళవారం ఆయన పాశమైలారంలో ప్రమాదం జరిగిన సిగాచి పరిశ్రమను సందర్శించారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో ఒడిసా, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఏపీ, తెలంగాణ వారు ఉన్నారని.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకత్వంతో మాట్లాడి వారందరినీ పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చా రు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.

పరిశ్రమలో తనిఖీలు లంచాల కోసం జరుగుతున్నాయా..? సేఫ్టీ అధికారులు ఎంతవరకు నిజాయితీగా పని చేస్తున్నారు..? అన్న అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతానంటే కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు భరోసా ఇచ్చారు.

Updated Date - Jul 02 , 2025 | 04:16 AM