G Vivek Venkataswamy: సామాన్యులకు అందుబాటులోకి ఇసుక: వివేక్
ABN, Publish Date - Jun 19 , 2025 | 03:59 AM
రాష్ట్రంలో సామాన్యులకు ఇసుకను అందుబాటులో ఉంచడానికి ఒక పటిష్ఠమైన పాలసీని రూపొందిస్తామని మంత్రి జి.వివేక్ వెంకటస్వామి అన్నారు.
గనులు, కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సామాన్యులకు ఇసుకను అందుబాటులో ఉంచడానికి ఒక పటిష్ఠమైన పాలసీని రూపొందిస్తామని మంత్రి జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రిగా సచివాలయంలో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సంక్షేమంతో పాటు, గనుల శాఖకు సంబంధించి రాబడి వృద్ధి కార్యక్రమాలను పటిష్ఠంగా చేపడతామని తెలిపారు.
తనకు కార్మిక శాఖను కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తన తండ్రి నిర్వహించిన కార్మిక శాఖను తనకు కేటాయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. టాటా టెక్నాలజీ్‌సతో కలిసి రాష్ట్రంలోని ఐటీఐల్లో రూ.2,076కోట్ల వ్యయంతో 46అడ్వాన్స్‌డ్ కోర్సులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. సంబంధిత ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు.
Updated Date - Jun 19 , 2025 | 03:59 AM