Gandhi Hospital: అయినా అదే తీరు.. మంత్రి మందలించినా మారని గాంధీ ఆస్పత్రి వైద్యులు
ABN, Publish Date - Mar 06 , 2025 | 07:33 AM
గాంధీ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆలస్యంగా వచ్చే డాక్టర్లు, ప్రొఫెసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా బుధవారం కూడా ఆస్పత్రిలో అదే పరిస్థితి కనిపించింది.
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆలస్యంగా వచ్చే డాక్టర్లు, ప్రొఫెసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా బుధవారం కూడా ఆస్పత్రిలో అదే పరిస్థితి కనిపించింది. ఓపీలో పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్లు, విభాగాధిపతుల తీరు మారలేదు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓపీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగాలని నిబంధనలు ఉన్నాయి. కానీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు(Professors, Assistant Professors) ఓపీలో కనిపించకపోవడంతో రోగులు పీజీ వైద్యులకు చూపించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రైళ్లలో గంజాయి మూటలు..
గైనిక్, కార్డియో, మెడిసిన్, జనరల్ ఓపీ(Gynecology, Cardiology, Medicine, General OP)లో బుధవారం ప్రొఫెసర్లు కనిపించలేదు. స్వయానా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినా, వైద్యులు మారకపోవడం చర్చనీయాంశంగా మారింది. బయోమెట్రిక్ విధానాన్ని కూడా వైద్యులు సరిగా ఉపయోగించడం లేదు. కొందరు వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రి పనులు చూసుకుని తమకు ఖాళీ దొరికినప్పుడు గాంధీ ఆస్పత్రికి వస్తున్నారు. ఆయా విభాగాల అధిపతులు చాంబర్లకే పరిమితమవుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు
ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!
ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం
ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు
Read Latest Telangana News and National News
Updated Date - Mar 06 , 2025 | 07:33 AM