ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Placards Controversy: తెలంగాణకు పాకిన రప్పా.. రప్పా డైలాగ్

ABN, Publish Date - Jun 21 , 2025 | 04:18 PM

Placards Controversy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. అయితే బీఆర్‌ఎస్ ధర్నాలో రప్పా.. రప్పా ప్లకార్డులు దర్శనమిచ్చాయి.

Placards Controversy

సంగారెడ్డి, జూన్ 21: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ (Former CM YS Jagan Reddy) ఇటీవల పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు ప్రదర్శించిన వివాదాస్పద ప్లకార్డులు రాజకీయంగా ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. మళ్లీ అధికారంలోకి వస్తే రప్పా.. రప్పా నరుకుతాం అంటూ వైసీపీ ప్లకార్డులు ప్రదర్శించడంపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వారిని అరెస్ట్‌ కూడా చేశారు. ఇప్పుడు రప్పా.. రప్పా డైలాగ్ తెలంగాణకు (Telangana) పాకింది.

అయితే ఏపీలో ఇలాంటి పాలిటిక్స్‌ కొత్తేమీ కాదు. కానీ తెలంగాణలో మాత్రం ఇలాంటి రాజకీయాలను ఎవరూ ప్రోత్సహించరు కూడా. ముఖ్యంగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు (Former Minister Harish Rao) ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన పాల్గొన్న ధర్నాలోనే హరీష్‌ ఫోటోలతో రప్పా.. రప్పా అంటూ వెలిసిన ప్లకార్డులు సంచలనం రేపుతున్నాయి.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాటు ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మానిక్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ఏర్పాటు చేశారు. 2028లో రప్పా.. రప్పా 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్లకార్డులు వైరల్‌గా మారాయి. ఇలాంటి ప్రచారం ఎప్పుడూ జరగలేదని.. కొత్తగా ఉందంటూ పార్టీ నేతలు అనుకుంటున్న పరిస్థితి.

అయితే హరీష్‌ రావు దృష్టిలో పడేందుకే సదరు నేత ఈ తరహా ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కచ్చితంగా గెలవబోతుందనే దానికి సంకేతంగా ఇలా ప్రచారం చేశాను తప్ప వేరే ఉద్దేశం లేదని ప్లకార్డులు ప్రదర్శించిన నేత చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు తన ఫోటోలతో వెలసిన రప్పా.. రప్పా ప్లకార్డులపై ఇటు హరీష్‌ రావు కానీ.. అటు బీఆర్‌ఎస్‌ అధిష్టానం కానీ స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

బల్దియాలో భారీగా బదిలీలు

కౌశిక్ రెడ్డి కేసు.. సీపీని కలిసిన గులాబీ నేతలు

సిట్‌ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యా‌ప్‌పైనే విచారణ

Read latest Telangana News And Telugu News

వీడియోను కింద చూడొచ్చు..

Updated Date - Jun 21 , 2025 | 05:09 PM