ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maoists: వాగుపై నక్సల్స్‌ భారీ వంతెన నిర్మాణం

ABN, Publish Date - Jul 29 , 2025 | 05:00 AM

అది ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా గుంజిపర్తి, కోమటిపల్లి సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాతం. ఎటు చూసినా గుట్టలు, లోయలతో ఉంటుంది.

  • గూగుల్‌ మ్యాప్స్‌లో బయటపడిన వారధి

చర్ల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): అది ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా గుంజిపర్తి, కోమటిపల్లి సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాతం. ఎటు చూసినా గుట్టలు, లోయలతో ఉంటుంది. ఆ దండకారణ్యంలో ప్రవహిస్తున్న అతి పెద్ద చింతవాగుపై మావోయిస్టులు భారీ వంతెన కట్టినట్లు తెలుస్తోంది. 15 రోజుల క్రితం కేంద్ర బలగాలు గూగుల్‌ మ్యాప్స్‌లో ఈ వారధిని గుర్తించాయి.

సుమారు 60 మీటర్ల పొడవున కర్రలతో పటిష్ఠంగా దీన్ని నిర్మించారని తెలుస్తోంది. గత డిసెంబరులో ఈ వంతెన లేదని బలగాలు చెబుతున్నాయి. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ మధ్య కాలంలోనే దీన్ని నిర్మించుకున్నట్టు అంచనా వేస్తున్నాయి. ఈ వంతెన ఉన్న ప్రాంతం తెలంగాణ సరిహద్దుకు 30 కి.మీ. దూరంలో ఉంటుంది.

Updated Date - Jul 29 , 2025 | 05:00 AM