ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pocharam: బీరు సీసాతో కొట్టి బాలికను చంపి.. రోడ్డెక్కి వాహనాలు, దుకాణాలపై రాళ్లు రువ్వి..

ABN, Publish Date - Mar 23 , 2025 | 05:22 AM

మతిస్థిమితం లేకనో.. మద్యం మత్తు వల్లో స్పష్టత లేదు కానీ.. విచక్షణ కోల్పోయి ఓ వ్యక్తి మేడ్చల్‌ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ ప్రాంతంలో శనివారం బీభత్సం సృష్టించాడు.

  • మతిస్థిమితం లేని ఓ వ్యక్తి బీభత్సం

ఘట్‌కేసర్‌ రూరల్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): మతిస్థిమితం లేకనో.. మద్యం మత్తు వల్లో స్పష్టత లేదు కానీ.. విచక్షణ కోల్పోయి ఓ వ్యక్తి మేడ్చల్‌ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ ప్రాంతంలో శనివారం బీభత్సం సృష్టించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన జగేశ్వర్‌ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం ముని సిపాలిటీ, లేబర్‌ క్యాంప్‌లో నివాసముంటూ ఇన్ఫోసి్‌సలో భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌, పర్బతిపూర్‌కు చెందిన హప్నహెమ్‌బ్రూమ్‌(30) అనే యువకుడు శుక్రవారం అక్కడే పనిలో చేరాడు.


ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం మధ్యాహ్నం లేబర్‌ క్యాంప్‌లో ఓ పక్కన ఆడుకుంటున్న రియాకుమారి తలపై హప్న బీరు సీసాతో కొట్టి పరుగు తీశాడు. గమనించిన తల్లిదండ్రులు రియాను ఆస్పత్రికి తరలించగా.. చికి త్స పొందుతూ బాలిక మరణించింది. మరోపక్క, జోడిమెట్ల వద్ద వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపైకి వచ్చిన హప్న.. అటుగా వస్తున్న వాహనాలపై రాళ్లు విసిరుతూ పరుగులు తీశాడు. దాడిలో రెండు కార్ల అద్దాలు, ఒక ఆటో ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. అలాగే, ఓ టైల్స్‌ దుకాణంపై రాళ్లు రువ్వి.. టైల్స్‌ అన్నింటిని ధ్వంసం చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హప్నను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Mar 23 , 2025 | 05:22 AM