ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రివర్గంలో మాదిగలకూ అవకాశం కల్పించండి

ABN, Publish Date - Jun 06 , 2025 | 03:14 AM

మంత్రివర్గ విస్తరణలో మాదిగలకూ అవకాశం కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ను..

  • ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వినతి

న్యూఢిల్లీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): మంత్రివర్గ విస్తరణలో మాదిగలకూ అవకాశం కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ను ఆ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మందుల సామేల్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్య కోరారు. గురువారం ఢిల్లీలో వారిని కలిసిన అనంతరం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ‘మంత్రివర్గంలో నిజమైన మాదిగలకు అవకాశం కల్పించాలి.


మంత్రివర్గంలో ఉన్న కొందరు మాదిగలమని చెప్పుకొంటున్నారు.. కానీ తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలెవరూ లేరు. ఇది మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల అంశం కాదు. ఇది యావత్‌ తెలంగాణ మాదిగల ఆత్మగౌరవానికి చెందిన అంశం. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అత్యవసర సమావేశం ఉండడంతో కలవలేకపోయాం. ఈ విషయమై ఆయనకూ లేఖ రాశాం’ అని వెల్లడించారు.

Updated Date - Jun 06 , 2025 | 03:14 AM