ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Eleti Maheshwar Reddy: రేవంత్‌ డమ్మీ.. మీనాక్షి అసలైన సీఎం: ఏలేటి

ABN, Publish Date - Apr 09 , 2025 | 04:02 AM

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ డీఫ్యాక్టో(అసలైన) సీఎంలా వ్యవహరిస్తున్నారని, సచివాలయంలో మంత్రులతో ఆమె సమీక్షతో రేవంత్‌ ఇక డమ్మీ సీఎం అన్న సంగతి స్పష్టమైపోయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు.

నిర్మల్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ డీఫ్యాక్టో(అసలైన) సీఎంలా వ్యవహరిస్తున్నారని, సచివాలయంలో మంత్రులతో ఆమె సమీక్షతో రేవంత్‌ ఇక డమ్మీ సీఎం అన్న సంగతి స్పష్టమైపోయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.


హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై మీనాక్షి ఏకంగా సచివాలయానికి వెళ్లి మంత్రులతో సమీక్ష నిర్వహించడం సరికాదని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జులుగా పనిచేసినవారు ఏనాడూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 04:02 AM