ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: కవితను చూసి జనం నవ్వుకుంటున్నారు!

ABN, Publish Date - Jul 12 , 2025 | 03:46 AM

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తేవాలన్న రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయానికి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఏంటి సంబంధమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రశ్నించారు.

  • బీసీ రిజర్వేషన్లతో ఆమెకేం సంబంధం?

  • ఇది రాహుల్‌ అజెండా.. రేవంత్‌ నిబద్ధత: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తేవాలన్న రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయానికి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఏంటి సంబంధమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఆమెను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకటి రెండు ధర్నాలు చేసినంత మాత్రాన తన వల్లనే అంతా అయిందంటూ కవిత మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయానికి ఆమె రంగులు పూసుకుంటున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నది రాహుల్‌గాంధీ అజెండా.. సీఎం రేవంత్‌ నిబద్ధత అని వ్యాఖ్యానించారు.

రాహుల్‌ ఆశయాన్ని నెరవేర్చడంలో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాజిక న్యాయం కాంగ్రె్‌సతోనే సాధ్యమని, బీసీల అభ్యున్నతికి కృషి చేసేది కాంగ్రెస్‌ మాత్రమేనని మరోమారు నిరూపితమైందని చెప్పారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారని.. కవిత బీసీల పాట పాడుతోందని ప్రశ్నించారు. కవితకు రాష్ట్రంలో భవిష్యత్తే లేదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ను అమలు చేసేందుకు ఆర్డినెన్స్‌ తేవాలని క్యాబినెట్‌ నిర్ణయించిన నేపథ్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ బీసీ నేతలు సంబరాలు చేసుకున్నారు.

Updated Date - Jul 12 , 2025 | 03:46 AM