ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bar Allocation: లాటరీ పద్ధతిన బార్ల కేటాయింపు

ABN, Publish Date - Apr 30 , 2025 | 03:52 AM

రాష్ట్రవ్యాప్తంగా 25 కొత్త బార్ల కోసం లాటరీ ద్వారా కేటాయింపులు నిర్వహించారు. మిర్యాలగూడలో 226 దరఖాస్తులు దాఖలయ్యాయి, జీహెచ్‌ఎంసీ పరిధిలో మే మొదటి వారంలో ప్రకటన చేయనున్నారు

  • బెల్లంపల్లి మినహా 24 చోట్ల డ్రా తీసిన కలెక్టర్లు

  • మిర్యాలగూడలో అత్యధికంగా 226 దరఖాస్తులు

  • జీహెచ్‌ఎంసీ పరిధిలోని 15 బార్లకు మే మొదటి వారంలో ప్రకటన

హైదరాబాద్‌/ మిర్యాలగూడ అర్బన్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 25 బార్ల ఏర్పాటు కోసం మంగళవారం ఆయా జిల్లాల్లో కలెక్టర్లు లాటరీ తీసి కేటాయింపులు చేశారు. బెల్లంపల్లి మినహా 24 చోట్ల కలెక్టర్లు డ్రా తీశారు. రాష్ట్రంలో 25 కొత్త బార్ల ఏర్పాటు కోసం 1,346 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీ తీసి కేటియింపులు జరిపారు. బెల్లంపల్లిలో సింగిల్‌ అప్లికేషన్‌ రావడంతో అక్కడ దరఖాస్తుల స్వీకరణ గడువును మే 5 వరకు పొడిగించారు. బెల్లంపల్లి మినహా మిగిలిన ప్రాంతాల్లో బార్ల ఏర్పాటు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఒక బార్‌ ఏర్పాటు కోసం 226 మంది దరఖాస్తు చేసుకున్నారంటే పోటీ ఏ మేరకు ఉందో ఊహించుకోవచ్చు.


ఈ నేపథ్యంలో అన్ని చోట్లా లాటరీ తీసి వ్యాపారులను ఎంపిక చేశారు. వీళ్లంతా ఎక్సైజ్‌ శాఖకు చెల్లించాల్సిన ఫీజు చెల్లించి, మిగిలిన ప్రక్రియలను పూర్తిచేసి కొత్త బార్లను ఏర్పాటు చేసుకోనున్నారు. వచ్చే నెలలో కొత్త బార్లు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియడంతో మే నెల మొదటి వారంలో ప్రకటన జారీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,176 బార్లు ఉండగా, కొత్తగా మరో 25 ఏర్పాటు కాబోతున్నాయి. దరఖాస్తుల విక్రయం ద్వారానే ప్రభుత్వానికి రూ.13.46 కోట్ల ఆదాయం సమకూరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో బార్ల ఏర్పాటుకు మరింత పోటీ నెలకొనే అవకాశం ఉంది. దరఖాస్తుల విక్రయం ద్వారానే రూ.50 కోట్లపైనే ఆదాయం రావొచ్చని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Apr 30 , 2025 | 03:52 AM