TG LAWCET 2025: లాసెట్‌లో 30,311 మంది ఉత్తీర్ణత
ABN, Publish Date - Jun 26 , 2025 | 04:06 AM
రాష్ట్రంలో మూడేళ్ల్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన లాసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడేళ్ల్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన లాసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్ట్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్, ఉపాధ్యక్షుడు పురుషోత్తం, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మి ఫలితాలను ప్రకటించారు. మొత్తం 57,715మంది దరఖాస్తు చేసుకోగా.. 45,609మంది హాజరయ్యారు.
వీరిలో 30,311 (66.46ు) మంది ఉత్తీర్ణులయ్యారని బాలకిష్టారెడ్డి తెలిపారు. వీరిలో 21,002మంది పురుషులు, 9,306మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని వివరించారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ విభాగంలో 21,715మంది, ఐదేళ్ల కోర్సు విభాగంలో 4,833మంది, పీజీలాసెట్‌లో 3,763మంది అర్హత సాధించారని తెలిపారు. ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు.
Updated Date - Jun 26 , 2025 | 04:06 AM