ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ప్రమాద బాధిత కుటుంబానికి కేటీఆర్‌ అండ

ABN, Publish Date - May 04 , 2025 | 04:49 AM

నిర్మల్‌ జిల్లాకు చెందిన విద్యార్థినులైన అక్కాచెల్లెళ్లు బాణావత్‌ మంజుల, అశ్వినీ శుక్రవారం ఆర్మూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు.

  • మలేషియాలో ఉన్న తండ్రి తిరుగు ప్రయాణానికి సాయం

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లాకు చెందిన విద్యార్థినులైన అక్కాచెల్లెళ్లు బాణావత్‌ మంజుల, అశ్వినీ శుక్రవారం ఆర్మూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన శనివారం ప్రకటనలో తెలిపారు. ఉపాధి కోసం వెళ్లి మలేషియాలో ఉంటున్న ఆ పిల్లల తండ్రి బాణావత్‌రెడ్డిని రాష్ట్రానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులను ఆయన ఆదేశించారు.


మలేషియాలోని భారత దౌత్యాధికారులతో సమన్వయం చేసి, ప్రయాణ అనుమతులు, టికెట్లు సహా అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కాగా, సీసీఐ పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్‌ నేతలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. కాగా, దేశవ్యాప్తంగా కుల గణనను శాస్త్రీయ ప్రమాణాలతో నిర్వహిస్తే సామాజిక న్యాయానికి విజయంగా నిలుస్తుందని బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - May 04 , 2025 | 04:49 AM