KTR: నిరుద్యోగుల కష్టాలు కనబడట్లేదా?
ABN, Publish Date - Jul 05 , 2025 | 04:32 AM
అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని రాహుల్‌గాంధీ పదే పదే చెప్పారని, ఈ విషయమై నిలదీసేందుకు వస్తే నిరుద్యోగులను అరెస్టు చేస్తారా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
నియామకాలపై నిలదీస్తే అరెస్టు చేస్తారా?: కేటీఆర్
అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని రాహుల్‌గాంధీ పదే పదే చెప్పారని, ఈ విషయమై నిలదీసేందుకు వస్తే నిరుద్యోగులను అరెస్టు చేస్తారా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్‌రెడ్డికి నిరుద్యోగుల కష్టాలు కనబడడం లేదా? అని ‘ఎక్స్’ వేదికగా శుక్రవారం నిలదీశారు.
ఏడాదిన్నరలో పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్లైనా ఇవ్వకుండా నిరుద్యోగులకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ ద్రోహాన్ని గడప గడపకు తీసుకువెళ్తామని, నిరుద్యోగుల పక్షాన బీఆర్‌ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు. కాగా, సిగాచీఫ్యాక్టరీ పేలుడులో మృతిచెందినవారి పట్ల రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అమానవీయమని, కార్మికుల మృతదేహాలను అట్టపెట్టల్లో తరలించడం దారుణమని కేటీఆర్ పేర్కొన్నారు. ఉపాధి కోసం వచ్చి చనిపోయిన కార్మికులకు కనీస గౌరవం ఇవ్వలేరా? అని ప్రశ్నించారు.
Updated Date - Jul 05 , 2025 | 04:32 AM