KTR: విలీనమా.. పస లేని ఆరోపణ
ABN, Publish Date - Jul 27 , 2025 | 04:13 AM
రాజకీయంగా ఇరకాటంలో పడిన ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ‘బీఆర్‌ఎస్ విలీనం’ అనే పసలేని అంశాన్ని తెరపైకి తెస్తాయని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
బీఆర్‌ఎస్‌ను ఏ పార్టీలోనూ కలిపే ప్రసక్తే లేదు
రేవంత్, రమేశ్ కలిసి వస్తే చర్చకు సిద్ధం
సీఎం రమేశ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
హైదరాబాద్ సిటీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాజకీయంగా ఇరకాటంలో పడిన ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ‘బీఆర్‌ఎస్ విలీనం’ అనే పసలేని అంశాన్ని తెరపైకి తెస్తాయని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎ్‌సను ఏ పార్టీలోనూ కలిపే ప్రస్తక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. తాము ఇరకాటంలో పడిన ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విలీనం అనే పనికిరాని, పసలేని చెత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తాయని కేటీఆర్ ఓ ప్రకటన చేశారు. బీఆర్‌ఎ్‌సను ఎప్పుడూ ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కుంభకోణాల నుంచి దృష్టి మరల్చేందుకు, తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేసేందుకే ఈ విలీన ఆరోపణలు అన్నారు.
నిబంధనలను అతిక్రమించడం, కాంట్రాక్టులను అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్, సీఎం రమేశ్ కలిసివస్తే హెచ్‌సీయూ రూ.10 వేల కోట్ల కుంభకోణం, రూ.1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ కుంభకోణంపై చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ కౌంటరిచ్చారు. హెచ్‌సీయూ భూములు తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్లు దోచుకునేందుకు సీఎం రేవంత్‌కు సహకరించినందుకు లేని ఫ్యూచర్ సిటీకి రహదారి నిర్మాణానికి రూ.1660 కోట్ల కాంట్రాక్టును సీఎం రమేశ్‌కు కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్, రమేశ్ బాగోతం బయటపెట్టడంతో కుడితిలో పడిన ఎలుకల్లా ఇద్దరూ కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 27 , 2025 | 04:13 AM